Saturday, March 6, 2021

Latest Posts

ఏ‌పి సచివాలయంలో 16,208 ఖాళీలు భర్తీ చేయనున్న ప్రభుత్వం

ఏ‌పి ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది, వేలమందికి ఏ‌పి గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగం కలిపించిన ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను తెలియచేసింది. త్వరలో కొలువుల జాతర జరగనున్నట్టు స్పష్టం చేసింది. ఏ‌పి గ్రామ సచివాలయాల్లో కొన్ని ప్రాంతీయ వార్డుల్లో 16,208 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అదికారులు తెలియచేసారు. కాగా వీటన్నిటికి త్వరలో భర్తీ చెయ్యనున్నట్టు తెలుస్తుంది.

త్వరలో ఈ పోస్టుల భర్తీకి సంభందించిన నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నట్టు తెలిపారు. పరీక్షా విధానం ద్వారా ఈ భర్తీలు జరుగుతాయని తెలిపారు. కాగా కరోనా ప్రభావం వలన వీటి భర్తీ ని వాయిదా వేస్తున్నామని కానీ పరీక్షలకు అనుమతి రాగానే ఆగష్టు 31 నాటికి ఖాళీలు భర్తీ అయ్యేలా చూస్తామన్నారు. ఈ వివరాలన్నీ పంచాయితీ రాజ్ సమావేశంలో అధికారులు సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి తెలియచేసారు. వీటితో పాటుగా కొన్ని గ్రామాలలో సచివాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని, పోస్టుల భర్తీతో పాటుగా భవన్ నిర్మాణాలను సైతం ఆగష్టు 31 నాటికి పూర్తి చేస్తామని అధికారులు సి‌ఎం జగన్ రెడ్డికి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మాస్క్ లేని వారిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss