ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 2051 కు పెరిగిన పాజిటివ్ కేసులు, చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1056 గా ఉంది. ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 46. కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 949.
ఈరోజు విడుదలైన కరోన వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా… కర్నూల్ – 09, కృష్ణ – 04, చిత్తూరు – 10, నెల్లూరు – 09, తూర్పు గోదావరి జిల్లా – 01 గా కేసులు నమోదు. కాగా శ్రీకాకుళం,విజయనగరం, పశ్చిమగోదావరి, అనంతపురం, గుంటూరు, కడప, ప్రకాశం, విశాఖ జిల్లాలో ఈ రోజు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఇది కూడా చదవండి: ఈ రోజు సాయంత్రం 8 గంటలకు మోడి ప్రసంగం