AP Minister AnilKumar Yadav tested negative for Coronavirus
కరోనా పాజిటివ్ వచ్చిన డాక్టర్‌ను కలిసినందుకు మంత్రి అనిల్ కుమార్ గారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి నెగిటివ్ రిజల్ట్ రాగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 3వ తారిఖున ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అనిల్ కుమార్ గారు వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం ఆ డాక్టర్‌కు పరిస్థితి విషమం గా ఉండటం వల్ల అతన్ని వెంటనే చెన్నై హాస్పటల్‌కు పంపించారు.
వైద్యుడితో ప్రారంభోత్సవం రోజున సన్నిహితంగా ఉన్నందున మంత్రి అనిల్ గారు 36 గంటల స్వీయనిర్బంధం లో ఉండి ఆదివారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆదివారం అయినా టెస్ట్ చేయగా సోమవారం సాయంత్రానికి రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయి. దాంతో రేపటి నుంచి చురుకుగా కరోనా అవగాహన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు అని అక్కడి వారు చెబుతున్నారు.