Thursday, February 25, 2021

Latest Posts

బాబుపై కన్నబాబు విసుర్లు

“అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే బాబు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే బినామీలకు చెందిన ఆస్తులను కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగారు”అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ, శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని గుర్తుంచుకోవాలన్నారు.
అభివృద్దిని చంద్రబాబు ఎంత కాలం అడ్డుకుంటారో తాము చూస్తామని కన్నబాబు వ్యాఖ్యానించారు . వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి బాబుకు అవసరం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా కాపు మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కన్నబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌అధికారంలో వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss