Wednesday, April 21, 2021

Latest Posts

సస్పెండైన డాక్టర్‌ పై పోలీసుల ప్రతాపం

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ డాక్టర్‌గా సుధాకర్ పనిచేశారు.నర్సీపట్నంలో ఇటీవల సరైన సౌకర్యాలు లేవని తనకు మాస్కులు, పీపీఈ , కిట్లు లేవంటూ అన్న డాక్టర్ సుధాకర్ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసినదే. అందువల్ల ఆయన ఈ రోజు ఆయన పోర్టు ఆస్పత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై అర్ధనగ్నంగా డాక్టర్ నిరసనకు దిగడంతో  ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి డాక్టర్ సుధాకర్  గారిని  రోడ్డుపై  అదుపుచేసేందుకు పయత్నం చేశారు.

ఆయన మెడపై లాఠీతో వంచి, రెండు చేతులను కట్టేసి, సుధాకర్‌ను కొట్టుకుంటూ పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.  దీనిపై ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందని, నిజాలు బయటపెట్టిన ఉత్తమ వైద్యుడైన సుధాకర్‌పై కక్ష కట్టి ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.

ఇది కూడా చదవండి: అకారణంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు: ఎస్.పి. సజ్జనార్‌

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss