AP police tracing corona effected people by reverse searching process :
AP లో కరోనా పాజిటివ్ ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. మొత్తంగా 200 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ లో గుంటూరు జిల్లా చేరింది. ఇప్పటి దాకా క్వారంటైన్ లో ఉన్న వారికి తిరిగి పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్దారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్య శాఖ బులిటెన్ లో గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రతిరోజూ గరిష్టంగా 14 నుంచి 18 కేసుల వరకు ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడం కూడా అధికారులకు సవాలుగా మారింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ ఫోన్ నెంబర్లు లిస్ట్ ను ఇప్పటికే గుర్తించిన అధికారులు వారందరిని క్వారంటైన్ కి తరలించారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురుకి 14 రోజుల క్వారంటైన్ చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడం కల కలం రేపుతోంది. గుంటూరు టౌన్ లో ఇప్పటికే 130 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో సిటీని రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు.
ఆ తరువాత నరసా రావు పేటలో 34 కేసులు నాచేపల్లి లో 14 కేసులుతో పాటు మంగళగిరి, పెద్ద కురపాడు, పొన్నూరు, మాచర్ల, చిలకలూరి పేట నియోజకవర్గాల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో తోలి కరోనా కేసు గుంటూరు నగరంలోనే వెలుగు చూసింది. ఆ తర్వాత జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సోకినట్టుగా అధికారులు గుర్తించారు. గుంటూరుకు చెందిన వ్యక్తి ద్వారా నరసారావు పేటలో కేబుల్ బిల్ వసూలు చేసే వ్యక్తికీ సోకినట్టు గుర్తించారు. కాగా అతనికి టీబీ ఉండడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో నరసారావు పేటలో కల కలం రేగింది. అయితే అతను గుంటూరుకు చెందిన కరోనా బాధితుడను కలిసినట్టు సెల్ల్ఫోన్ కాంటాక్ట్ ద్వారా గుర్తించారు. కాగా ఇలా పోలీసులు సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారా రివర్స్ సెర్చింగ్ చేస్తూ కరోనా ఎఫెక్ట్ అయిన వారిని ట్రేస్ చేస్తున్నారు.