Monday, July 26, 2021

Latest Posts

ఏపీలో స్కూళ్ల మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కరోనా లాక్ డౌన్ తర్వాత పాఠశాల పునఃప్రారంభంపై విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్నీ విద్యాసంస్థలకు ఈ మార్గదర్శకాలు ఇవి వర్తిస్తాయి. పాఠశాలలో ఒక్కొ విద్యార్థికి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా క్లాస్ రూమ్‌ల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ క్లాస్ మినహా మిగిలిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఇబ్బందుకుల కలగకుండా చర్యలు చేపడుతున్నారు. అయితే టీచర్లు మాత్రం రోజు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది.

కాగా నవంబర్ నెల మొత్తం హాఫ్ డే మాత్రమే స్కూళ్లను నిర్వహిస్తారు. అంటే ఉదయం 9 నుంచి 1.30 వరకు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం ముగిశాక వారిని ఇంటి పంపిస్తారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా మూడు దశల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తొలుత నవంబర్ 2 నుంచి 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతుండగా, రెండో విడతలో భాగంగా నవంబర్ 23న 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అవుతాయి. ఇక అఖరిగా డిసెంబర్ 14 నుంచి ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి 1,3,5,7,9 తరగతులకు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరసటి రోజు తరగతులు నిర్వహించాలి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss