Monday, May 10, 2021

Latest Posts

కండిషన్స్ అప్లయ్ అంటున్న ఏ.పీ ప్రభుత్వం

లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు ప్రజలు కూడా ఆర్ధికంగా బాగా నష్టపోయారు.  ఇక తిరిగి ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలు ఎక్కించే క్రమంలో లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులను ఇచ్చాయి. అందులో భాగంగానే షాపుల తెరవడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఒక జీవోను కూడా జారీచేసి రేపటి నుండి షాపులు తెరుచుకోవచ్చని తెలిపింది. కానీ కొన్ని కండిషన్స్ లోబడి షాపులు తెరుచుకోవచ్చని తెలిపింది.

కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో షాపులను తెరవచ్చని అయితే మెడికల్ షాపులకు ఎక్కువ మినహా ఆఫీసులు, షాపు లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని అక్కడ పని చేసే సిబ్బంది చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి అని నిబందనలు పెట్టింది. షాపుల వద్ద ఐదు గురి కంటే ఎక్కువ మంది గుమ్మి కుడి ఉండరాదని జీఓలో తెలిపారు. అలాగే వస్త్ర, పాదరక్షలు, ఆభరణాల షాపులు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదని కావాలంటే ఆన్ లైన్ ద్వారా హోం డెలివరీలు చేసుకోవచ్చు అని తెలిపింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss