Monday, May 10, 2021

Latest Posts

ఆంధ్రాలో థియేటర్లు మూసివేత దానికి కారణం ఏమిటంటే?

AP Theaters Shut Down

టికెట్ ధరలను సవరిస్తూ పాస్ చేసిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని థియేటర్లను మూసివేయాలని తూర్పు గోదావరిలోని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు జీవోను తిరిగి తీసుకునే వరకు నిరవధికంగా థియేటర్లను మూసి ఉంచాలని వారు నిర్ణయం తీసుకున్నారట. దీనిని రాష్ట్రవ్యాప్త మూసివేతగా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడు పాస్ చేసిన జీవో రేట్లతో, విద్యుత్ ఛార్జీలు మరియు విపిఎఫ్ ఖర్చులను కూడా తిరిగి రావని యజమానులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో థియేటర్లు ప్రొజెక్షన్ కు, సౌండ్ సిస్టమ్, సీటింగ్ ఇలా అనేక విషయాల కోసం దాదాపుగా 2 కోట్లు పెట్టుబడి వరకు పెట్టాయి. ఇప్పుడు ఈ జీవో కారణంగా వారు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.

లవ్ స్టోరీ, టక్ జగదీష్ వంటి పెద్ద చిత్రాలను వాయిదా పడిన తరువాత, చిన్న సినిమాలు ఆ గ్యాప్ ని పూరిస్తూ… తమ సినిమాలు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మూసివేత అంటే మొత్తం పరిశ్రమ కరోనా కాలం నాటికి స్థితికి చేరుకుంటుంది. ఇది టాలీవుడ్ పరిశ్రమ మనుగడకే ఇబ్బంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss