Home వైరల్ పంతం నెగ్గించుకున్న AP ప్రభుత్వం

పంతం నెగ్గించుకున్న AP ప్రభుత్వం

AP Will Start English Medium In government Schools

చాలా రోజుల నుంచి ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పాఠశాల విధ్య కమిషనర్ ఆదేశాలతో పనులు ప్రారంభించనున్నారు. కాగా ఈ మేరకు ఇంగ్లిష్ మీడియం పై APSCERT ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేసిన పాఠశాల విధ్య కమిషనర్ అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా మైనారిటీ పాఠశాలలు యధావిధిగా కొనసాగించవచ్చని తేల్చిన కమిషనర్, ఇంగ్లిష్ మీడియం కోరితే ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేసి చదువు చెప్పాల్సిందిగా తెలిపారు.

కాగా ఇంగ్లిష్ మొత్తం విద్యార్దులు 17,97,168 ఉండగా వీరిలో మీడియం వైపు మొగ్గు చూపుతున్న వారు 1,743,221 ఉన్నారని, మిగిలిన వాళ్ళు తెలుగు మీడియం కావాలనుకుంటున్నారని తెలిపారు. కాబట్టి కోరిన ప్రతి చోట తెలుగు మీడియం ఉంచనవసరం లేదు అని, మండలానికి ఒక్క స్కూల్ చొప్పున 672 తెలుగు మీడియం స్కూల్లు ఏర్పాటు చెయ్యల్సిందిగా కోరింది. కాగా దీనికి గాను ప్రభుత్వానికి 6 వేలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: జూన్ 3 న జరగనున్న వాయిదా పడ్డ తెలంగాణ ఇంటర్ పరీక్షలు

Exit mobile version