Sunday, June 20, 2021

Latest Posts

అపరిచితుడు ని రీమేక్ చేయనున్న శంకర్

Aparichitudu Remake
అపరిచితుడు సినిమా రీమేక్ కానుంది అది కూడా బాలీవుడ్ లో. దీని పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు శంకర్ అపరిచితుడు’ ను హిందీలో రీమేక్ చేయనున్నారు మరియు ఈ చిత్రం షూటింగ్ 2022లో ప్రారంభమవుతుంది. రణ్‌వీర్ సింగ్ హిందీ వెర్షన్‌లో విక్రమ్ పాత్రను పోషించనున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఈ చిత్రం పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గడా బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని బ్యాంక్‌రోల్ చేయనున్నారు. ఇప్పటికే విజయవంతమైన చిత్రానికి రీమేక్ చేయడం మంచి పనే అయినా అది మళ్ళీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించి మళ్ళీ తెలుగు, తమిళ భాషలలొ వదలడం వల్ల నష్టం కలిగే సూచనలు ఉన్నాయి.

ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ యొక్క చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే రనవీర్ తో సినిమా తీసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss