దేశం మొత్తం కరోనా తో యుద్దం చేస్తున్న తరుణమిది. అ మహమ్మారిని మరిచి పోకుండా చాలా మంది ఈ సమయంలో వారికి పుట్టిన శిశువులకు కరోనా పేరు వచ్చేలా రకరకాల పెడుతున్నారు. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకుంటే, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఆరమ్ బాగ్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా ఆదే విధంగా చేశారు. కరోనా మన దేశంలో ప్రవేశించిన తర్వాత అపరూప పొద్దార్ ఒక పాపకి జన్మనిచ్చారు.
బెంగాలో జన్మించిన శిశువుకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టి నట్లు తెలుస్తుంది. దీనిపై అపరూప దంపతులు స్పందిస్తూ ప్రపంచం మొత్తం కరోన తో పోరాడుతోన్న ఇలాంటి క్లిష్ట సమయంలో తమ కూతురు జన్మించిందని అందుకే తనకి కరోనా అని ముద్దుపేరు పెట్టినట్లు తెలిపారు. అయితే తమ పాపకి అధికారిక పేరును మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెడతారని తెలిపారు.