Home రాజకీయం సి.ఏం అనుమతీస్తే 24 గంటల్లో సర్వీసు  

సి.ఏం అనుమతీస్తే 24 గంటల్లో సర్వీసు  

Transport Minister Perni Nani is Ready To Resume Bus Services in AP

ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని. బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్‌ మార్పులు చేశామని, పల్లెవెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టం అమలు చేస్తున్నామన్నారు. అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా  ఆర్.టి.సి తగిన జాగ్రత్తలు తీసుకుంతుందని తెలిపారు.

లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కాబట్టి కేంద్ర నిబంధనలు, జోన్లలో పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని  సి.ఎమ్ నుంచి అనుమతి రాగానే 24 గంటల్లో సర్వీసులు నడుపుతామన్నారు. మరోవైపు ఆర్టీసీలో ఒక్క ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగిస్తూ వస్తున్న వార్తలపై  మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారం జరిగిందని వారికి కరోనా ఇన్సూరెన్స్ లేనందునే కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచామని, ఉద్యోగుల్ని ఎక్కడా తొలగించలేదని స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: మళ్ళీ కలవబోతున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్

Exit mobile version