కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదేలయ్యింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల సమయంలో ఉద్యోగాల తొలగింపుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు ఏ ఆదారం లేక రోడ్డున పడతాయని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సహా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు కూడా రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారికి లేఖలు రాశాయి. అయితే ఇదే ఈ క్రమంలోనే రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా ఉద్యోగాల నుంచి తొలగించొద్దంటూ ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా లేఖ రాసింది.
లాక్డౌన్ కాలంలో మానవతా విలువలతో ఆలోచించి ఏ ఉద్యోగినీ తొలగించొద్దని కేంద్రం చెప్పినా అవి ఏవి యాజమాన్యం పట్టించుకోకుండా ఔట్ సోర్సింగ్ తొలగించిందని సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించబోమని ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు మంత్రి గారు కార్మిక సంఘాల అభ్యర్థనలు, అభ్యంతరంతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పేర్ని నాని చర్చించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి పేర్నినాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీ ఎస్ ఆర్టీసీ ఉపసంహరించు కున్నట్లు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి స్పెషల్ పాస్లు జారీచేస్తున్న ఏపీ ప్రభుత్వం