ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి నుంచి ఏపిఎస్ఆర్టిసి సర్వీసులను మొదలు పెట్టింది. కృష్ణా జిల్లాలో 35 రూట్లలో 110 బస్సులు నడపడం జరిగింది. విజయవాడ బస్టాండ్ నుంచి కూడా ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సర్వీసులు రెండు నెలల తరువాత కళకళలాడుతున్నాయి. బస్ స్టాండ్ లో మాస్క్ లు లేని ప్రయాణికులను హెచ్చరిస్తూ, టికెట్ కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు తీస్కున్నారు అధికారులు.
డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతి చెయ్యడం మంచి పద్దతి అని ప్రయాణికులు అభినందిస్తున్నారు. కాగా నిన్నటి నుంచి బస్ స్టాండ్ లకు చేరుకుంటున్న ప్రయాణికులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రయాణం చెయ్యడం జరిగింది. ముందుగా దూరాప్రాంతలకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విజయవాడ నుండి విశాఖకు మొదటి సూపర్ లగ్జరి బస్సు ను కూడా మొదలుపెట్టడం జరిగింది. విశాఖ, రాజమండ్రి, కాకినాడ కి బస్సు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: