Tuesday, April 13, 2021

Latest Posts

ఏ‌పి‌లో రోడ్డెక్కిన ఏ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి బస్సులు

కరోనా వలన ఇప్పటివరకు మోగించని బస్సు హారన్ లు ఇప్పుడు మోగనున్నాయి. ఈ రోజు నుంచి ఏ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి సర్వీసులను ప్రారంభించింది. ఈరోజు నుంచి ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి  సాయంత్రం 7 గంటల వరకు బస్సులను తిప్పనుంది ఏ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి.

కాగా బస్సులో మాత్రం భారీ మార్పులను ఏ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి చెయ్యడం జరిగింది. సీట్లలో మార్పులు చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా, వ్యక్తికి వ్యక్తికి దూరం ఉండేలా మరియు మాస్కూలు అందరూ ఉపయోగించేలా, సానిటైజర్ వాడెలా చర్యలు తీసుకుంది.

కాగా సాయంత్రం 7 గంటల వరకు అందివ్వనున్న ఈ సర్వీసులకు ఆన్లైన్ లోనే టికెట్ లను కొనే వెసులుబాటు ఉంది. కాగా ఎటువంటి ధరలు పెంచడం లేదు అని ఆర్‌టి‌సి ఎం‌డి తెలియచేసారు. జి-పే, ఫోన్-పే, పేటి‌ఎం వంటి వాటితో టికెట్ కొనుక్కోవచ్చని చెప్పారు. ఏరోజూకారోజు టికెట్ కొంటే ఎటువంటి రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చెయ్యబడవు అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss