Tuesday, April 13, 2021

Latest Posts

అమ్మ బయోపిక్ కి సోగ్గాడు దొరికేసాడు

ఇండస్ట్రీలో బయోపిక్స్ జోరుగానే స్టార్ట్ చేసినా,ఈ మధ్య నెమ్మదించాయి. అయితే   తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ కూడా జోరందుకుంది.  జూన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఈ మూవీకి దర్శకుడు గా ఏఎల్‌ విజయ్ వ్యవహరిస్తున్నాడు.  తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, జయ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజిఆర్ రోల్‌లో అరవింద స్వామి కనిపించబోతున్నారు.

Aravinda swami

ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్స్, ప్రొమోస్ రిలీజై విశేష  ప్రజాదారణ సంపాదించాయి. కాగా  మొన్నటితరం హీరో శోభన్‌బాబుకు జయలలిత జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరూ అప్పట్లో రిలేషన్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వీరిద్దరి సంబంధాలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే  మొదట అసలు శోభన్‌బాబు పాత్ర ‘తలైవి’లో ఉంటుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్యారెక్టర్ ఉంటుందని ఫిక్స్ అవ్వగానే..ఆ రోల్‌లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించనున్నాడని టాక్ నడిచింది.

తాాజాగా సోగ్గాడి పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషుసేన్‌ గుప్తాను కన్ఫామ్ చేసినట్టు టాక్. ఇప్పటికే అతడు శోభన్‌బాబు పాత సినిమాలు చూసి.. అయన బాడీ లాంగ్వేజ్‌ ఇమిటేట్ చెయ్యడం కోసం 42 ఏళ్ల జిషుసేన్‌ గుప్తా ప్రయత్నాలు స్టార్ట్ చేసాడట.  బాలయ్య హీరోగా నటించిన ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో ఎల్వీ ప్రసాద్‌గా కనిపించిన జిషుసేన్‌ గుప్తా ఇటీవల నాగ శౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’లో విలన్‌గా  మెప్పించాడు. సోగ్గాడుగా సెలెక్ట్ అయిన విషయంపై  అధికారిక  ప్రకటన రావాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss