Thursday, May 13, 2021

Latest Posts

నాన్నకు ప్రేమతో మూవీలో విలన్ గా అరవింద్ ని అనుకున్నారట…..

సినిమాల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగిపోతుంటాయి. ఫలానా పాత్రకి ఫలానా వ్యక్తి ఖచ్చితంగా సూటవుతాడని అనుకుంటే,చివరి నిమిషంలో అతడికి అనివార్య కారణాల వలన కుదరకపోవడం,ఒక్కోసారి ఆ పాత్రకు ఒప్పుకోకపోవడం జరుగుతాయి. అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో జరిగింది. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. తారక్ కి మంచి హిట్ రావడంతో అక్కడనుంచి వరుస హిట్స్ నమోదవుతున్నాయి.

అయితే ఈ మూవీలో విలన్ పాత్రలో జగపతి బాబు వేసాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు. విలన్ గా జగపతి బాబు నటించాడు. ఈ సినిమాలో హీరో అభిరామ్ (ఎన్టీఆర్) తండ్రి (సుబ్రహ్మణ్యం) రాజేంద్ర ప్రసాద్ ను కృష్ణమూర్తి (జగపతిబాబు) మోసం చేస్తాడు. తనను మోసం చేసిన కృష్ణమూర్తిపై పగతీర్చుకోవాలని సుబ్రహ్మణ్యం తన కొడుకులను కోరతాడు. దీంతో సుబ్రహ్మణ్యం చిన్న కొడుకు అభిరామ్ (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగి కృష్ణమూర్తి (జగపతిబాబు)పై పగ సాధించి అతన్ని రోడ్డుపై తీసుకొస్తాడు.

నిజానికి ముందుగా జగపతి బాబుని అనుకోలేదంట. జగపతి బాబు వేసిన పాత్ర కోసం తమిళ నటుడు అరవింద స్వామిని అనుకున్నారట. కానీ అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా చేయలేకపోయాడట. అందుకే ఆయన ప్లేస్‌లో అప్పటికే తెలుగులో స్టైలిష్ విలన్‌గా దూసుకెళుతున్న జగపతిబాబును ఎంపిక చేయడంతో మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు తన నటనతో అదరగొట్టాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss