Sunday, June 20, 2021

Latest Posts

ఆర్‌జి‌వి ఇంటర్వ్యూ పై టెన్షన్ తో ఫీల్ అవుతున్న అరియానా

Ariyana Glory Feared Of RGV Interview

యాంకర్ అరియానా గ్లోరీ గత ఏడాది తొలిసారి ఆర్‌జివిని ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిలో పడింది. దీని తర్వాత ఆమె బిగ్‌బాస్ షో లో కూడా అవకాశం కొట్టేసింది. అయితే తాజాగా మరోసారి అతనితో ఇంటర్వ్యూ చేసింది ఈ బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ అరియానా. ఇక ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వారు వర్కవుట్ చేయడం ప్రారంభించినట్లు ఇటీవల ఆర్జివి అరియానాతో కలిసి జిమ్ లో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు ఆర్‌జి‌వి.

ప్రస్తుత సమాచారం ప్రకారం, తనను ఇంటర్వ్యూ చేయమని ఆర్జీవీ అరియానాను అడిగినట్లు తెలిసింది. అలానే ఇంటర్వ్యూను జిమ్‌లో వినూత్నంగా ప్లాన్ చేశారు. ఇక ఇంటర్వ్యూను కట్ చేయడం మరియు ప్రోమోను కట్ చేయడం బాధ్యత ఆర్‌జివి తీసుకున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ ఫైనల్ కట్ అయిన తర్వాత అరియానాకు చూపించాడట ఆర్‌జి‌వి.

దీనిని చూసిన అరియానా ఇప్పుడు టెన్షన్ తో ఫీల్ అవుతుందట. ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అరియానా తెగ ఆందోళన చెందుతుందట స్నేహితుల వద్ద. ఇంతకముందు కూడా అరియానను బికినీలో చూడాలనుకుంటున్నాని ఆర్‌జి‌వి తెలిపాడు. మరి ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఎలాంటి కాస్ట్యూమ్ ఆర్జీవీ ఫిక్స్ చేశాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss