Thursday, May 13, 2021

Latest Posts

కరోనా వారియర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన త్రివిధ దళాలు

Armed forces says Thanks to Corona warriors

వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు తన ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్‌ తో నిత్యం పోరాడుతున్నారు. వారు  చేస్తున్న సేవలకు యావత్ ప్రపంచ సలాం చేస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో అలుపెరగని పోరాటం చేస్తున్న కరోనా వారియర్స్ కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు వారిచేస్తున్న సేవలకు గాను వినూత్నంగా త్రివిధ దళాలు పూల సత్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలిపాయి.

ఇటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్నీ కరోనా హాస్పటల్ పై ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఇక హైదరాబాద్‌ లోనూ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం దగ్గర వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, నాలుగో తరగతి ఉద్యోగులపై హెలికాఫ్టర్‌ ద్వారా పూలవాన కురిపించారు. దాదాపు మూడు రౌండ్లు వారిపై పూలు కురిపిస్తూ వారి సేవలకు సెల్యూట్ చేశాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss