Saturday, May 15, 2021

Latest Posts

తల్లి కోసం వచ్చిన ఉగ్రవాదిని హతమార్చిన సైన్యం

Army Killed The Terrorist

హంద్వారా ఎన్‌కౌంటర్ జరిగిన 3 రోజుల్లోనే సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు అతడి సొంత గ్రామంలోనే కడతేర్చరు. తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను కలిసేందుకు సొంతూరు బేగ్‌పొరాకు ఈ నెల 5న వస్తున్నట్లు సమాచారం అందుకున్న సైన్యం అతనిని పట్టుకునేందుకు పక్క ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. రెండేళ్లుగా అతని కోసం ట్రాక్ చేస్తూ వచ్చిన  సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి  ఏవిధమైనటువంటి  పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని రియాజ్ హతమార్చారు.

ఈ నెల 5న రియాజ్ వస్తునట్లు తెలుసుకున్న భారత సైన్యం ఆ రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటిన్నర కిలోమీటర్‌ వరకూ గ్రామాన్ని చుట్టుముట్టారు.  గతంలో నాలుగుసార్లు తప్పించుకోవడంతో ఈసారి అవకాశం ఇవ్వకూడదని సైన్యం నిర్ణయించుకుంది. ఉదయం 9 గంటలకు రియాజ్ దాక్కున్న ఇంటిని గుర్తించి పేల్చేశారు. అయితే అక్కడ నుంచి తృటిలో తప్పించుకున్న రియాజ్ మరో ఇంట్లోకి దూరాడు. ఆ ఇంట్లో అప్పటికే ఉన్న సైన్యం రియాజ్‌ను హతమార్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss