ఢిల్లీ: నాలుగో దశ లాక్డౌన్ నేపథ్యంలో కొద్దిమేర సడలింపులు ప్రకటించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ట్విటర్ వేదికగా పలు సూచనలు చేశారు. ఈ రోజు నుంచి దిల్లీలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగున్నాయి. క్రమశిక్షణతో మెలిగి, కరోనాను కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిది. మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం ఇప్పుడు చాలా అవసరం. మీరు, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. మనం క్రమశిక్షణగా ఉంటే దేవుడు మనకు సాయం చేస్తాడు అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మెట్రో రైళ్లు మినహా ప్రజా రవాణాకు దిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
आज से कुछ आर्थिक गतिविधियाँ शुरू हो रही हैं। हमारी बहुत बड़ी ज़िम्मेदारी है कि पूरे अनुशासन से रहें और करोना को कंट्रोल में रखें। मास्क, सोशल डिस्टन्सिंग और हैंड सैनिटायज़र
आप और आपका परिवार स्वस्थ रहें- ऐसी प्रभु से प्रार्थना है।हम अनुशासन से रहेंगे, तो प्रभु हमारी रक्षा करेंगे
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 19, 2020
ఇది కూడా చదవండి: అదొక బోగస్ ప్యాకేజీ – కేసీఅర్
ఇది కూడా చదవండి: జర్నలిస్టులకు వైద్య సిబ్బంది కరోనా టెస్ట్ లు నిర్వహించండి – తెలంగాణ గవర్నర్