Tuesday, January 25, 2022

Latest Posts

కోహ్లీకి నోటీసులు – చిక్కుల్లో పడ్డ భారత కెప్టెన్

ASCI To Send Notice To Virat Kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఇబ్బందుల్లో  పడ్డాడు. అయితే, ఈసారి క్రికెట్ కోసం ఇబ్బందుల్లో పడలేదు ఒక యాడ్ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. విరాట్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీకి సంబందించి ఒక ప్రకటన చేశాడు. ఇందులో అథ్లెట్లు, ఒలింపిక్స్‌కు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అయితే విరాట్ యొక్క ఈ పోస్ట్ కి చాలా విమర్శలు వచ్చాయి.

తాజాగా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా విరాట్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ పోస్టు పై అతనికి నోటీసులు పంపనుంది. ఆ పోస్ట్ లో ఏముందంటే ఒక గొప్ప రికార్డ్, ఒలింపిక్స్‌లో 10% మంది ఆటగాళ్ళు లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం నుండి వచ్చారు. రాబోయే కాలంలో, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం నుండి క్రికెట్‌ ఆటగాళ్లను కూడా పంపండని, ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారత కెప్టెన్ ని సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తున్నారు.

ఒక భారత కెప్టెన్ గా ఇలాంటివి చేయకూడదని మండిపడుతున్నారు. సాధారణంగా ప్రకటనకు సంబంధించిన పోస్ట్ చేసేటప్పుడు సెలెబ్రేటిలంతా ఆ పోస్ట్ లో పార్ట్నరింగ్ అని అందుకు సంబందించిన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పోస్ట్ లో అలాంటివి కనిపించలేదు. దీనితో, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విరాట్ కి నోటీసు పంపనుంది. కోహ్లీతో పాటు, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయానికి కూడా నోటీసులు పంపనున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss