Thursday, May 13, 2021

Latest Posts

వ్యాక్సిన్ తయారీ దారుల ఆన్ లైన్ మీటింగ్

Asia has held a key meeting with the vaccine makers

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలోనే లక్ష కేసుల దాకా వచ్చేస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ వాక్సిన్ కోసం ప్రయోగాలు,అధ్యయనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దక్షిణ తూర్పు ఆసియా దేశాల వ్యాక్సిన్ తయారీ దారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అంటూ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదరుచూస్తున్న సమయంలో ఈ సమావేశం జరగటం అత్యంత ప్రాదాన్యాన్ని సంతరించుకుంది.

ఆన్‌లైన్ జరిగిన ఈ సమావేశంలో భారత్, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌కు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. వ్యాక్సిన్ తాయరీ వ్యవస్థ సంసిద్ధతపై ఈ సందర్బంగా జరిగిన సమీక్ష లో తూర్పు దక్షిణాసియా ప్రాంతంలోని కంపెనీలకు ప్రపంచానికంతటికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే సామర్థ్యం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ క్షేత్రపాల్ తెలిపారు.

కంపెనీలు తమ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాలపై చర్చించగా, ఆయా దేశాల ప్రభుత్వం సంస్థలు పాలనాపరమైన అనుమతుల జారీ మరింత సులభతరం చేయడంపై చర్చించినట్టు డబ్ల్యూహెఓ ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముందున్న దేశాల జాబితాలో భారత్, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్ కూడా ఉన్నాయి. వివిధ వయసుల్లో ఉన్న లక్షలాది మంది పిల్లలకు ఈ దేశాల్లో తయారైన వ్యాక్సిన్లే ప్రాణాలు రక్షిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss