Tuesday, January 25, 2022

Latest Posts

అర్ధరాత్రి దేవినేని ఉమా పై దాడి

Attack On Former Minister Devineni Uma

మాజీ మంత్రి దేవినేని ఉమాను అర్ధరాత్రి దాటాక కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమా, కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరుగుతోందని టీడీపీ శ్రేణులతో కలసి దీన్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఆయన బంధువులతో కలిసి ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ విషం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు,ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉమా కారును చుట్టుముట్టి దాడికి పాల్పడటంతో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు దిగారు.

ఈ దాడుల్లో ఓ వైసీపీ నేత కారుతో పాటు ఓ టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనంతటికీ దేవినేని ఉమానే కారణమన్న ఆరోపణలతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  ముందస్తు ప్లాన్‌లో భాగంగానే ఈ వివాదానికి తెరలేపారని దేవినేని ఉమా,టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారని దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తినే అరెస్ట్ చేస్తారా, తనపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అటు వైసీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉన్న మైలవరంలో పక్కా ప్లాన్ ప్రకారమే దేవినేని ఉమా అల్లర్లు చెలరేగేలా చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss