Home TRENDING లాక్ డౌన్ లో హెడ్ కానిస్టేబుల్ పై దాడి

లాక్ డౌన్ లో హెడ్ కానిస్టేబుల్ పై దాడి

Attack on Head Constable in Lockdown

లాక్ డౌన్ విరమణ సమయంలో రోడ్ పై హోటల్ బడ్డీ వద్ద టిఫిన్ చేస్తున్న వ్యక్తి ని వారించడంతో హెడ్ కానిస్టేబుల్ పై ఆ వ్యక్తి కర్రతో దాడి చేసిన సంఘటన మండపేట లో బుధవారం చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు మండపేట కెపి రోడ్ లో మెడికల్ స్టోర్స్ వెలుపల రోడ్ పై ఓ హోటల్ బడ్డీ ఉంది. అక్కడ నేలటూరు కు చెందిన వ్యక్తినిలబడి టిఫిన్ తింటున్నాడు. ఇక్కడ తిన కూడదు పార్సిల్ తీసుకుని వెళ్లిపోవాలని డ్యూటీ లో ఉన్న మండపేట టౌన్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చెప్పారు.

ఆ వ్యక్తి రెచ్చిపోయి పోలీసులు ఎవరి దగ్గర ఏంతేసి లంచాలు తీసుకుంటున్నారో చెప్పనా అంటూ దుర్భాషలాడాడు. ఇంతలో కానిస్టేబుల్ లాఠీ ఎత్తగా కొపోద్రిక్తుడైన ఆ వ్యక్తి అక్కడే ఉన్న తాళ్ళు, కర్రలు విక్రయించే షాప్ నుండి ఓ కర్ర తెచ్చి కానిస్టేబుల్ బుర్ర పై కొట్టాడు. దీంతో స్థానికులు కానిస్టేబుల్ ను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతి వేలు విరిగింది. తలపై గాయమైందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు టౌన్ సి ఐ సంఘటన పూర్వ పరాలు విచారించి దీనిపై కేసు నమోదు చేశారు. కాగా నేలటూరు కి చెందిన వ్యక్తి కు కొద్దిగా మతి స్థిమితం లేదనే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాత్రం ఆ వ్యక్తి కావాలనే కానిస్టేబుల్ పై విరుచుకు పడ్డాడని చెబుతున్నారు.

Exit mobile version