Attempt Murder Case Will Be Filed If You Do This in Public
కరోనా మహమ్మారికి అమెరికా లాంటి అగ్ర రాజ్యం విలవిలలాడిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంతిలా ప్రపంచంలో కరోనా మారణహోమం చూస్తున్నా కొందరు మాత్రం మన దేశంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అతి తక్కువ కేసులతో, రెండో దశలో ఆగిపోవాల్సిన భారతదేశం కొందరు మూర్ఖుల వల్ల మూడో దశలోకి వెళ్లే ప్రమాదం ముంచుకొస్తోంది.మరోవైపు ఢిల్లీల జరిగిన తబ్లిగి జమాత్ సమావేశం ఈ దేశాన్ని పెద్ద అపాయంలోకి నెట్టింది. వేలమందికి అక్కడ కరోనా సోకడం – వారు దేశ వ్యాప్తంగా కరోనాను తమ తమ రాష్ట్రాలకు మోసుకెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఏదైతేనేం .. మర్కజ్ వ్యవహారానికి బలైన రాష్ట్రాల్లో తమిళనాడు – ఆంధ్ర – తెలంగాణ – హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలున్నాయి. దీన్ని ఎలా ఆపాలో సర్వశక్తులు ఒడ్డి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్దేశ పూర్వకంగా బాధ్యత రాహిత్యం వ్యవహరించే కరోనా రోగుల పట్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కఠిన చట్టం అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఎవరైనా కరోనా రోగి ఇతరులపై ఉమ్మడం – తుమ్మడం చేస్తే హత్యాహత్నం కేసు నమోదు చేస్తారు.
ఒకవేళ ఇలాంటి వారి వల్ల ఎవరైనా కరోనాతో చనిపోతే హత్యాయత్నం కేసును మర్డర్ కేసుగా మార్చి… ఆ మరణాన్ని సాక్ష్యంగా చూపి విచారించాలని ఆ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్సార్ మర్ది ప్రకటించారు.ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల ఎంతో కొంత ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలో కరోనా రోగులు గాని సాధారణ వ్యక్తులు గాని బహిరంగంగా ఎక్కడ ఉమ్మినా ఉరి శిక్ష వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.