auto rickshaw driver died through corona in mumbai
ప్రపంచని వణికిస్తున్న కరోన మన దేశంలో కూడా విజృంబిస్తుంది. కొన్ని రోజుల వరకు ఫారన్ రేటర్న్ మరియు వారి బందువులుకు పరిమితమే ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుల వరకు వచ్చేసింది. ఇంకా వివరాలలోకి వెళ్తే ముంబయి లోని ఖర్గార్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఆటో డ్రైవరు అక్కడి సూపర్ మార్కెటుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి అతనకు అనారోగ్యానికి గురవడంతో అతను తలోజా ప్రాంతంలో స్థానిక ఆసుపత్రిలో వైద్యుడి వద్ద చికిత్స పొందారు,తర్వాత అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షించగా వైరస్ సోకిందని తేలింది. అతనికి కరోనాకు తోడు డెంగీ జ్వరం కూడా సోకింది, దీంతో అతన్ని ఎన్ఎంఎంసీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవరు కరోనా తో శుక్రవారం మరణించాడు. మృతుడి తల్లి, భార్య, కుమార్తెలను పరీక్షించగా వారికి కరోనా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది.ఆ ప్రాతం చెందిన మున్సిపాల్ కార్పొరేషన్ అప్రమత్తమైనది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూపర్ మార్కెట్ తోపాటు, ఆసుపత్రి, ఇంటి ఆప్రాంతాన్ని శానిటైజ్ చేసి, అనుమానితులను క్వారంటైన్ చేశారు.