Avika Gor Turns Into Producer
చిన్న సినిమాలు చేసుకుంటూ తనకంటూ టాలీవుడ్ లో ఒక పేరు తెచ్చుకున్న అవికా గోర్ ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న తరువాత, ఆమె తన నటన-కమ్-ప్రొడక్షన్ వెంచర్‌ను ధృవీకరించింది. ఆమె తన తదుపరి చిత్రం అవికా స్క్రీన్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో చేయనున్నట్టు ప్రకటించింది.
ఆమె నిర్మాతగా మారిన మొదటి సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని షేర్ చేసింది. ఇలా షేర్ చేస్తూ ఒక మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. అదేంటంటే “నా కల నిజమైంది”. ఆమె ఇలా నిర్మాతగా మారబోతున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిది. అంతే కాకుండా, అవికా ఇంకా ఏం చెప్పిందంటే, “ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, నాకు అవకాశం ఇచ్చిన పరిశ్రమకు తోడ్పడటానికి మరో ముందడుగు వేస్తున్నాను. మీ అంచనాలన్నిటికీ నేను న్యాయం చేయగలనని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను !! దయచేసి వీలైనంత వరకు మా సినిమాని షేర్ చేయండి. ”
View this post on Instagram
మరి ఇప్పటి వరకు చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న ఈ అమ్మడి లక్ ఇప్పుడైనా మారుతుందో లేదో చూడాలి. ఆమె చివరిసారిగా నటించిన రాజు గారి గాది 3 కాస్త పరవాలేదనిపించింది.
ఇవి కూడా చదవండి: