Sunday, June 13, 2021

Latest Posts

ఇంతకీ స్వీటీ బ్యూటీ పెళ్లి ఎవరితోనో తెలుసా

ఏది వదంతో ఏది నిజమో తేలినంతగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు, ఒక నటి గురించి ఏదైనా విషయం గురించి ప్రచారం జరిగితే దాన్ని ముందు వారు ఖండించినా, ఆ తరువాత అదే నిజం అవుతోన్న ఘటనలూ ఉన్నాయి. అయితే చాలా వరకూ అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఏ వార్త నిజమో, ఏది వదంతో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నటి అనుష్క గురించిన జరుగుతున్న ప్రచారంపైనా ఇదే గందరగోళం నెలకొంది. అంతెందుకు యోగా భామ అనుష్క ప్రేమ గురించి ఇప్పటికే పలు రకాల ప్రచారం చూసాం.

అనుష్కతో మూడు చిత్రాల్లో నటించిన నటుడు ప్రభాస్‌తో ప్రేమ అంటూ పెద్ద ప్రచారమే జరగ్గా, వారిద్దరూ విడివిడిగా ఖండించారు.తాము మంచి ఫ్రెండ్స్‌ అని క్లియర్‌గా స్పష్టం చేశారు. అయినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలం కొనసాగింది. ఆ తరువాత ఒక వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమాయణం అనే ప్రచారం జరగ్గా, ఇటీవల ఒక క్రికెట్‌ క్రీడాకారుడి చెట్టాపట్టాలని, త్వరలో ఆయనతో పెళ్లి పీటలు ఎక్కడానికి అనుష్క రెడీ అవుతోందని ప్రచారం జోరందుకుంది. వీటిని కూడా అనుష్క ఖండించింది. ఒక సినీ దర్శకుడితో అనుష్క ప్రేమాయణం అని, ఆ దర్శకుడికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చారని, అనుష్కను రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారని తాజాగా మరో ప్రచారం వైరల్‌ అవుతోంది.

కాగా ఏదేమైనా ఈ 38 ఏళ్ల స్వీటీ పెళ్లి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకూ ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఆమె ఎదుర్కోక తప్పదు. అందుకే తాజాగా జరిగే ఈ ప్రచారంలో అయినా నిజం ఉందా లేక ఇదీ యథాతథంగా వదంతేనా? అనేది తేలాలి. మరి సినీ దర్శకుడితో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి నటి అనుష్క ఎలా స్పందిస్తే తప్ప అసలు విషయం తెలీదు. ఇకపోతే నటి అనుష్క నటించిన బహుబాషా చిత్రం సైలెన్స్‌ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు తదుపరి చిత్రం ఏమిటో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడైనా పెళ్లి గురించి వార్త చెబుతుందేమో.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss