ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఏనుగుపై ఆసనాలు వేస్తూ అకస్మాత్తుగా కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదు. ఉత్తర ప్రదేశ్లోని మథురలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. రాందేవ్ బాబా యోగాసనాలు వేయడంలో ఎంత ప్రసిద్ధో అందరికీ తెలిసిందే. ఆయన వివిధ రకాల్లో వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయడంలో వెరీ వెరీ స్పెషల్. సోమవారం రాందేవ్ బాబా మథుర లో ఉన్న రామ్ నరేటి ఆశ్రమంలో మహావన్ ఆశ్రమానికి వెళ్లారు. అసలు ఈ ఆశ్రమానికి రాందేవ్ వెళ్లడానికి ఓ కారణం ఉంది. అక్కడి ఋషులకు ఆయన యోగా ప్రాక్టీస్ అలవాటు చేద్దామనుకున్నారు. తీరా చూస్తే ఇలా అయ్యింది. అయితే ఆయన అక్కడున్న వారికి సాధారణ యోగాసనాలు కాకుండా ఏనుగు పై పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఉన్నట్టుండి కదలడంతో దాని పైన కూర్చున్న రాందేవ్ బాబా అదుపుతప్పి కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ఎన్నో రకాల యోగాసనాలు వేస్తూ ఎంతో కీర్తి తెచ్చుకున్న రామ్ దేవ్ బాబా ఇలా ఏనుగు పై ఆసనం వేస్తూ కింద పడిపోవడంతో ప్రయోగం వికటించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆగస్టులో కూడా ఇలాగే ఓ ఘటనలో రాందేవ్ బాబా పడిపోయారు. ఓ సైకిల్ పై వెళ్తూ నీరు ఉన్న రోడ్డుపై జారి పడ్డారు. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి: