Bail Petition for Revanth Reddy Postponed to tomorrow:
కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు నేడు బెయిల్ ఇవ్వలేదు . కేసులో తీర్పును రేపటికి వాయిదా వెయ్యటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది
కేటీఆర్ ఫాం హౌస్ వద్ద రూల్స్ కు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. నేడు కూకట్ పల్లి కోర్టులో జరిగిన వాదనల్లో జడ్జి ఈ పిటీషన్ విషయంలో తీర్పు రేపటికి వాయిదా వేశారు. ఇక రేవంత్ రెడ్డి పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ వారెంట్‌ను చూపి ఆయనను విచారణకు అప్పగించమని అడిగారు పోలీసుల తరపు లాయర్ .