ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజున సందర్బంగా కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు నేటి ఉదమయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. గంటకి 1000 మంది చొప్పున రోజుకు 10వేల మందికి భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు గంటలకు ఒకసారి క్యూ లైన్లో సానిటైజ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: