balakrishna and nagarjuna have never played a single movie together
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆపాత మధురం సినిమాలెన్నో ఉన్నాయో అందులో ముఖ్యంగా ఎన్టీఆర్,అక్కినేని కల్సి నటించిన గుండమ్మ కథ గల క్రేజ్ మాములుగా ఉండదు. అప్పట్లోనే సూపర్ హిట్ మూవీ. ఇప్పటికీ టివిలో ఈ సినిమా వస్తే, జనం టీవీలకు అతుక్కుపోతారు. అయితే తరువాత తరంలో ఈ మూవీని బాలకృష్ణ, నాగార్జున ఈ సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. అయితే అప్పట్లో స్టార్ హీరోలైన నందమూరి , అక్కినేని తొలిసారి ‘పల్లెటూరు పిల్ల’ సినిమాలో కలిసి నటించి, సినీ కెరీర్లో 14 సినిమాల్లో కలిసి చేసారు. చివరగా ‘సత్యం శివం’ సినిమా కల్సి చేసారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నట వారసుడిగా బాలయ్య,, అక్కినేని నటవారసుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటారు.
ఇక వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. నిజానికి ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. కుదరకపోవడంతో ఆ తర్వాత అక్కినేని, నందమూరి మూడో తరం వారసులు ఎన్టీఆర్, నాగ చైతన్య లతో గుండమ్మ కథ సినిమా ప్రతిపాదన వచ్చింది. ఒకవేళ భవిష్యత్తులో చేయొచ్చేమో. అయితే హిందీలో హిట్టైయిన ‘చుప్కే చుప్కే’ సినిమా ను రీమేక్ లో బాలయ్య, నాగ్లు కలిసి చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన సీడీని అప్పట్లో నాగార్జునకు కూడా బాలయ్య ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.
ఆ సినిమా చూసిన నాగార్జున ఎంతో ఇంప్రెస్ అవ్వడం, ఆ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా బాలయ్య చేయించడం జరిగాయట. ఇక చుప్కే చుప్కే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. హృషికేష్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ వెనక్కి పోయింది. ఈ రకంగా వెండితెరపై బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ రాలేకపోయింది.ఇక నాగార్జునతో సినిమా చేయలేకపోయిన బాలయ్య.. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ‘భార్య భర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం’ ఈ మూడు సినిమాల్లో కలిసి నటించారు. . అటు నాగార్జున కూడా నందమూరి హరికృష్ణతో ‘సీతారామరాజు’ సినిమా చేసారు. అలాగే సుమంత్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటించారు.