Saturday, January 16, 2021

Latest Posts

బాలయ్య ఉదారత్వం

Balakrishna donates Rs 1.25 crore for fight against coronavirus

కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు. దేశం, రాష్ట్రాలు ఇంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున సమయంలో తమవంతు సాయం చెయ్యడానికి కొంతమంది విరాళాల రూపంలో దేశానికి రాష్ట్రాలకు అందజేస్తున్నారు.

అలాగే తనవంతు సాయంగా హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, మరో  రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి  మరియు లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న  తెలుగు సినీ కార్మికుల సహాయార్థం రూ.25 లక్షల రూపాయలను ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.  స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని ఈ సందర్భంగా ప్రజలు అందరికి పిలుపునిచ్చారు.

బాలకృష్ణ ప్రకటించినట్లులు గానే తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల రూపాయల చెక్క్ ను  తెలంగాణ మినిస్టర్ కేటీఆర్‌కు, రూ. 25 లక్షల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్‌కు ఆయన అందించారు. ఆంధ్రకు ప్రకటించిన విరాళాన్ని  త్వరలోనే ఏపీ సీఎం జగన్‌కు అందజేస్తామని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss