Balakrishna playing Aghora Role in Boyapati Movie:
నందమూరి బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించనున్నారా?… ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటన్న ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపిస్తున్నారని, ఆ పాత్రలో బాలయ్య తక్కువ మాటలు హావభావాలతో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన “సింహ”, “లెజెండ్” లాంటి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకుల అంచనాలను మించి అలరించాయి.
బాల కృష్ణ తదుపరి చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచిన కారణంగా బోయపాటిని లైన్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం మొదలయ్యి చాలా కాలం అయినప్పటికీ కొన్ని కారణాల వాళ్ళ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో బాలయ్య తక్కువగా మాట్లాడే అఘోర పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో ట్విన్ రోల్స్ కూడా చేస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా కోసం చాలా మందిని పరిశీలించి చివరకు హీరోయిన్గా అంజలిని తీసుకున్నారు. అలాగే సినీయర్ భామ శ్రియ సరన్ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.