Home సినిమా వార్తలు క‌వ‌ల‌లుగా నటసింహం

క‌వ‌ల‌లుగా నటసింహం

Balakrishna to do twins action in next film
Balakrishna to do double action in next film

అప్పుడెప్పుడో రాముడు భీముడు, అపూర్వ స‌హోదరులు చిత్రంలో క‌వ‌ల‌లుగా న‌టించిన నందమూరి నటసింహం బాల‌కృష్ణ తాజాగా క‌వ‌ల‌లుగా ఓ సినిమా చేస్తున్నాడు. డిజాస్టర్స్ తర్వాత హిట్ కోసం తపిస్తూ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మూవీలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ హీరోగా నటిస్తున్న సంగతి తెల్సిందే. శ్రియా శ‌ర‌న్‌, అంజ‌లి హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో మూడో సినిమా ఇది.

వచ్చే మార్చి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ఇప్పటికే సింహా, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ని, అందులో ఒక పాత్ర అఘోరాగా క‌న‌ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నాడని టాక్. మొత్తానికి చాలా ఏళ్ల త‌ర్వాత బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నాడని చెప్పాలి. క‌వ‌ల‌ల్లో చిన్న‌ప్పుడే ఇద్ద‌రూ విడిపోతార‌ట‌. ఒక‌రు వార‌ణాసిలో..మ‌రొక‌రు అనంత‌పూర్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. వార‌ణాసిలో పెరిగిన అఘోరా పాత్ర ఇంట‌ర్వెల్‌లో ఎంట్రీ ఇస్తుంద‌ట‌. రకరకాల ఫీలర్లు తో ఈ సినిమా అభిమానుల్లో హీట్ పెంచుతోంది.

Exit mobile version