Thursday, December 2, 2021

Latest Posts

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను నాగ‌ళ్ల‌తో దున్నుతా – బండి సంజ‌య్

Bandi Sanjay Comments On KCR

తెలంగాణ బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ వ‌ద్ద బ‌డుగుల ఆత్మ‌గౌర‌వ పోరు ధ‌ర్నాలో పాల్గొన్న బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణా ప్రభుత్వం పై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ఒక్కొక్క ద‌ళితుడికి రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.30 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చసారు. రాష్ట్రంలో 18శాతం ధ‌ళితులు ఉన్నార‌ని, వారిలో ఏ ఒక్క‌రికీ ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త‌లు లేవా అని బండి సంజ‌య్ ఈ సభ ద్వారా కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. 2023లో తెలంగాణ‌లో బీజేపీ వస్తుందని, అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌ని, దున్నిన ఆ భూమిని ప్ర‌జ‌ల‌కు పంచుతామని అన్నారు.  పోడు భూముల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss