Bandy Sanjay takes oath as telangana state BJP president
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ రోజు(ఏప్రిల్ 29న) పదవి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా మార్చి 11న లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. మొదట లాక్డౌన్ ముగిసిన అనంతరం బాధ్యతలు చేపట్టాలని భావించినా పార్టీ పరమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ గారికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ‘శ్రీ బండి సంజయ్ గారికి’ నా తరుపున, జన సైనికులు మరియు జనసేన పార్టీ నాయకుల అందరి తరుపున మనః పూర్వక శుభాకాంక్షలు’’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే ఆ ట్విట్ట్ కు స్పందించిన సంజయ్ గారు ధన్యవాదలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇదే సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను అంటూ బదులిచ్చారు.