Thursday, December 2, 2021

Latest Posts

ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు 10 వేలు జరిమానా

Banks Will Have To Pay Heavy Fines If ATMs Run Out Of Cash

ఏటీఎంలలో క్యాష్ లేకపోతే సదరు బ్యాంకుపై జరిమానా విధించనున్నట్లు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.  ఈ నూతన నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ తీసుకువచ్చిన బ్యాంకు, వైట్ లేబుల్ ఏటీఎంలలో సిస్టమ్ ను సరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఏటీఎం లలో నగదు లభ్యతను పర్యవేక్షించాలని ఆర్బీఐ సూచించింది.

ఈ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే జరిమానానలు విధిస్తామని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ నూతన నిబంధన ప్రకారం ఏదైనా ఏటీఎం సెంటర్లో నెలలో 10 గంటలకు మించి డబ్బులు లేకపోతే రూ. 10 వేలు జరిమానా విధించబడుతుంది. అయితే వైట్ లేబుల్ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే వాటికి నగదు పంపిణీ చేసే బాధ్యత కలిగి ఉన్న బ్యాంకుకు జరిమానా విధిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss