BCCI Shocks Yuvraj Singh
భారత మాజీ ఆల్‌రౌండర్ సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కి బిసిసిఐ షాకిచ్చింది. 2019, జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, మళ్లీ ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఆశించాడు. కానీ, బీసీసీఐ మాత్రం యువీ ఆడేందుకు అంగీకరించలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీలో యువీ ఆడేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యువరాజ్ సింగ్.. విదేశీ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడేశాడు. తొలుత గ్లోబల్ టీ20 కెనడా, ఆ తర్వాత టీ10 లీగ్ ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్స్‌లో ఆడిన తర్వాత మళ్లీ బీసీసీఐ పరిధిలో జరిగే మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనర్హులు. ఈ నిబంధన ప్రకారం యువరాజ్ సింగ్‌కి దేశవాళీ క్రికెట్లో ఆడటం అసాధ్యం గా మారింది.
2020, జనవరిలో ప్రారంభంకానున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని యువరాజ్ సింగ్ ఆశించాడు. ఈ మేరకు పంజాబ్ టీమ్ అతడ్ని సంప్రదించి.. టోర్నీ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జట్టులోనూ చోటిచ్చింది. కానీ.. బీసీసీఐ తాజాగా యువీకి అనుమతి నిరాకరించి అతనికి ఝలక్ ఇచ్చింది. దాంతో, యువీ కేవలం విదేశీ లీగ్స్‌లో మాత్రమే ఆడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: