హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని వెతుక్కుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఎంత భారీ బడ్జెట్ సినిమాలు తీసినా, ఎంత మంచి దర్శకుడు సినిమా తీసినా అతనికి అదృష్టం కలిసి రావడం లేదు. అయితే ఈ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే చిత్రం కోసం జాక్ పాట్ కొట్టినట్లే కనిపిస్తుంది.
ఇప్పటి వరకు చిన్న బ్యానర్లో సినిమాలు తీసిన ఈ హీరో ఇప్పుడు పెద్ద బ్యానర్లో నటించే అవకాశం కొట్టేశాడు. అది కూడా యువీ క్రియెషన్స్ బ్యానర్లో. డెబ్యూట్ దర్శకుడు శ్రీరామ్ ఈ సినిమాను దర్శకత్వం వహించబోతునట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దర్శకుడు శ్రీరామ్ ఈ మధ్యనే సాయి శ్రీనివాస్‌కు స్క్రిప్ట్‌ను వివరించాడు మరియు అతను స్టోరీ తో హీరో ను బాగా ఆకట్టుకున్నాడు. దీనితో అతనితో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
అయితే, సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ముంబైలో తన బాలీవుడ్ అరంగేట్రం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రం చత్రపతికి రీమేక్ కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ 2020 నవంబర్‌లో ప్రారంభించబడింది మరియు సాయి శ్రీనివాస్‌పై సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ బృందం ఇటీవలే ముంబైకి వెళ్లింది. రీమేక్‌ను పెన్ స్టూడియోస్ బ్యానర్ క్రింద దవాల్ జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిన వెంటనే ఈ చిత్రం పట్టాలేక్కే అవకాశం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: