Monday, May 10, 2021

Latest Posts

స్టోక్స్ కి గాయం రాజస్థాన్ కి పెద్ద ఎదురుదెబ్బ

Ben Stokes Ruled Out Of IPL 2021

ఏప్రిల్ 12 న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో వేలికి గాయం కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపిఎల్ 2021 సీజన్ మొత్తానికి పూర్తిగా దూరం అయ్యాడు. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్‌ను అవుట్ చేయడానికి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టే సమయంలో అతనికి గాయం అయినట్టు తెలుస్తుంది.

గత సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్‌కు ఈ సారి కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.  గాయంతో జోఫ్రా ఆర్చర్ సేవలను వారు ఇప్పటికే కోల్పోయారు. ఇప్పుడు స్టోక్స్ కి కూడా గాయం కావడంతో వారి టీం మరింత బలహీనం కానుంది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రితో కలిసి ఉండటానికి న్యూజిలాండ్ వెళ్ళిన స్టోక్స్ గత సీజన్ లీగ్ దశలోని ఆరు మ్యాచ్ లను ఆడలేదు. ఇప్పుడు మరో సారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.

అయితే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనేది ఇంకా తెలియదు. డేవిడ్ మిల్లెర్ మరియు లియామ్ లివింగ్స్టోన్ రాయల్స్ జట్టులో బ్యాకప్ ఓవర్సీస్ బ్యాట్స్ మెన్ గా మిగిలి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss