Tuesday, January 25, 2022

Latest Posts

నేడు మోదీతో మమతా బెనర్జీ భేటీ

Bengal CM to meet PM Modi Today

పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడితో భేటీ కానున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడితో భేటీ కానున్నారు మమతా. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగాఈ రోజు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని, కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింగ్వీ లాంటి ఇతర పార్టీ లీడర్లను కూడా కలుసుకోనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు కమల్ నాథ్,3 గంటలకు ఆనంద్ శర్మ,6:30 కి అభిషేక్ మను సింగ్విని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు మమతా బెనర్జీ. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలని మమత చూస్తున్నారని, ఇందులో భాగమే ఈ పర్యటన అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss