నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా Director: వెంకీ కుడుముల ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ కలిసి చేసిన ప్రాజెక్ట్ భీష్మ. వీరికి తోడుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న లక్కీ ఛార్మ్ రష్మిక మందన్న జతకలిసింది. ఇలాంటి రేర్ కాంబినేషన్‌తో భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ కథా నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
భీష్మ కథ
భీష్మ (నితిన్) ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితంలో ఒక్క అమ్మాయి ప్రేమలోనైనా పడాలనే కోరికతో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చైత్ర (రష్మిక మందన్న) భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఓ సందర్భంలో చైత్రతో భీష్మ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా భీష్మ ఆర్గానిక్ కంపెనీ, ఫీల్డ్ సైన్స్ రెండు కంపెనీల మధ్య పోటీ వైరం ఉంటుంది. భీష్మ కంపెనీని తొక్కేయాలని ఫీల్డ్ కంపెనీ అధినేత (జిషు సేన్ గుప్తా) కుట్ర పన్నుతుంటాడు. ఆ క్రమంలో భీష్మ కంపెనీ అధినేత భీష్మ (అనంత నాగ్) తనకు వయసు పైబడటంతో తన వారసుడి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కనీసం డిగ్రీ పాస్ కానీ భీష్మ (నితిన్)ను కంపెనీ సీఈవోగా నియమిస్తాడు. 30 రోజుల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తాడు.
దర్శకుడు వెంకీ కుడుముల
రొటీన్ లవ్ స్టోరికి సేంద్రియ వ్యవసాయం పాయింట్‌ను క్లబ్ చేయడంలోనే దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ సినిమా ఆరంభంలోనే కల్పించాడని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడనే విషయాలను బేరీజు వేసుకొని పక్కాగా స్క్రిప్టును బ్యాల్సెన్ చేయడం డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కడానిపిస్తుంది. వెన్నెల కిషోర్‌తో సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ.. మరోవైపు సీరియస్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను సాధారణ ప్రేక్షకులకు అరటిపండు ఒలిచిపెట్టినంత ఈజీగా తెరకెక్కించాడు. ఇక కమర్షియల్ విలువల కోసం లవ్ స్టోరీని, యాక్షన్ సీన్లను ఏకకాలంలో సమపాళ్లలో ఎగ్జిక్యూట్ చేయడం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. ఓవరాల్‌గా ఎలాంటి సాహసాలు చేయకుండా, తడబాటు లేకుండా సినిమాను ఫీల్‌గుడ్‌గా మలచడంలో వెంకీ కుడుముల పూర్తిస్థాయిలో సఫలమయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసే ప్రయత్నం సులభంగా జరిగిపోయిందని చెప్పవచ్చు.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్ నితిన్, రష్మిక కెమిస్ట్రీ అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా ఫెర్ఫార్మెన్స్ వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే, డైరక్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫి ఆర్గానిక్ ఫార్మింగ్ అంశం మైనస్ పాయింట్స్ రొటీన్ లవ్ స్టోరి ఊహించే విధంగా క్లైమాక్స్
మూవీ రేటింగ్ : 3.5/5.