Monday, January 18, 2021

Latest Posts

భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు

Bhuma Akhila Priya Bail

కిడ్నాప్‌ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు వారు తిరస్కరించారు. అయితే ఆమెను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ పట్ల సికింద్రాబాద్ కోర్టు సానుకూలంగా స్పందించింది. దర్యాప్తు పురోగతి కోసం 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు మాత్రం భూమా అఖిలప్రియను మూడ్రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది. ఈ రోజు అఖిలప్రియను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు ఈనెల 13 వరకు విచారించనున్నారు.

కిడ్నాప్‌ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసు వారు ప్రయత్నం చేయనున్నారు. ఇకపోతే బోయిన్‌పల్లి అపహరణ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె భర్త ఏ3 నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నారు. హఫీజ్‌పేట భూములకు సంబంధించిన వివాదంలో ప్రవీణ్‌రావ్‌ సోదరులను కిడ్నాప్‌కు గురికాగా దానివెనక ఉంది అఖిలప్రియ అని పోలీసులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss