అమెరికాలో జరిగిన అమెరికా ఎన్నికల లెక్కింపునకు తెరపడింది. ఒక దశలో ట్రంప్ గెలుపుఖాయం అనుకున్న దేశ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్ మొదటిసారిగా ప్రసంగించారు. బైడెన్ ప్రసంగంలో అమెరికాలో కొనసాగుతున్న రాక్షస పాలనకు తక్షణమే అంతం పలకాలనుకుంటున్నానని, అమెరికా ఎదుర్కొంటున్న బాధాకరమైన చీకటి సమయం అంతం కావడం ప్రారంభమైందని ఆయన పేర్కన్నారు. విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్న, రిపబ్లికన్ల ఆధిక్యతలోని రెడ్ స్టేట్స్, డెమోక్రాటిక్ పార్టీ ఆధిక్యతలోని, బ్లూ స్టేట్స్గా విభజించి చూసే నేతగా తానుండబోనని, మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే యునైటెడ్ స్టేట్స్కు అధ్యక్షుడిగా ఉంటానని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా రిపబ్లికన్ పార్టీల్లో ఏ ఒక్కరూ తనకు శత్రువులు కారని, వారు కూడా అమెరికన్లే కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే పాలన సాగిస్తానని బైడెన్ పేర్కొన్నారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, ప్రజాస్వామ్య బద్ధంగానే పరిపాలన చేస్తా, ప్రత్యర్ధులు మన శత్రువులు కాదు.. వారు కూడా అమెరికన్లే, అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయి అని అన్నారు బైడెన్. కమలా హ్యారిస్ అద్భుత నాయకురాలు. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందాం అని బైడెన్ ఆశావహ దృక్పథంతో ప్రసంగించారు. కమల హ్యారిస్ వంటి సమర్ధురాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై తాను గర్విస్తున్నట్లు బైడెన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: