Monday, May 10, 2021

Latest Posts

కరోనాతో విమానయాన సంస్థలకు భారీ నష్టం

Big loss to airlines with Coronavirus effect :

ఇదీ అదీ అని లేదు, కరోనా వైరస్ ప్రభావం అన్నింటినీ అంతుచూసేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ విమానాలు నిల్చిపోతున్నాయి. ఇక భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన సర్వీసుల రద్దుతో విమానయాన సంస్థలు క్రమంగా కష్టాల్లో కూరుకుపోతున్నాయి. తాజాగా ఎయిరిండియా శుక్రవారం ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, శ్రీలంక దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

కోవిడ్-19 రోజురోజుకు మరిన్ని దేశాలకు విస్తరిస్తుండడంతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుంది. కువైట్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన తర్వాతి రోజే మరిన్ని దేశాలకు సేవలు నిలిపివేయడం గమనార్హం. ఏప్రిల్ 30వ తేదీ వరకు సేవలు అందుబాటులో ఉండవని వివరించింది. గత నెల రోజుల్లో భారత్ వేదికగా రాకపోకలు సాగించే 600 అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. ఇందులో 500 విమానాలు విదేశీ సంస్థలవి కాగా, మిగతావి దేశీయ సంస్థలవి అని లెక్కతేలింది.

దౌత్య పరమైన, ఉపాధి సంబంధిత వీసాలు తప్ప ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత విమానాల రద్దు ఎక్కువైంది. దేశీయ సంస్థలు వీక్లీ విమానాలను కూడా రద్దు చేశాయి. ఈ విషయంలో ఇండిగో సంస్థ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెబుతూ,ఇది తాత్కాలికమేనన్నారు. కరోనా తర్వాత ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పడిపోయాయని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss