Sunday, January 24, 2021

Latest Posts

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్ జస్ట్ ఎలిమినేట్ అవ్వబోయి.. తప్పించుకున్నాడు. ఇక మోనాల్ గత రెండు వారాల క్రితం వరకు సరిగా ఆడకుండా గ్లామర్ తోనూ, అఖిల్ ట్రాక్ తో నెట్టేసింది. కానీ ఇప్పుడు బాగా ఆడేస్తుందన్న కారణంతో హౌస్ లో కొనసాగుతుంది. ఇక అభిజిత్ కి టాస్క్ పెరఫార్మెన్స్ తక్కువ బిల్డప్ ఎక్కువ అనే టాక్ నడుస్తుంది.

ఇక హారిక గట్టిగా పోరాడుతుంది కానీ.. అభిజిత్ విషయంలో వీకైపోతుంది. ఇక అరియనా, సోహైల్ అప్పుడప్పుడు గట్టిగా ఆడుతున్నారు. అయితే ఈ సోమవారం నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ అసలు రంగులు బయటికొచ్చాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో రంగు నింపి కారణం చెప్పి ఇంటి సబ్యులని నామినేట్ చెయ్యాలి. అందులో హారిక అభిజిత్ ని నామినేట్ చేసి షాకిచ్చింది. నాగార్జున క్లాస్ కి హారిక అభిజిత్ కి బొమ్మ చూపించింది. అంతేనా మోనాల్ అఖిల్ ని నామినేట్ చేసి షాకివ్వగా.. అఖిల్ నన్ను బ్యాడ్ చేస్తున్నావ్ అంటూ మోనాల్ తో గొడవ సార్ట్ చేసాడు. అరియనా – మోనాల్ గొడవకి అవినాష్ ఆజ్యం పోసాడు. అలాగే అవినాష్ నేను స్ట్రాంగ్ అంటున్న అఖిల్ కి కౌంటర్ వేసాడు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను.. నాకన్నా వీక్ ఉన్న వాళ్ళు హౌస్ లో ఎలా ఉంటారంటూ అవినాష్ గోల గోల చేశాడు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో అభిజిత్, అవినాష్, మోనాల్, హారిక, అఖిల్ ఉన్నారు. మరి నామినేట్ అయిన ఈ ఐదుగురిలో అందరిలో వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అవినాష్, మోనాల్ కనిపిస్తున్నారు. అభిజిత్ ఏమి ఆడకపోయినా కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ తో లాక్కొచేస్తున్నాడు. ఈ వారం కూడా ఇతను సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక హారిక కూడా ఇప్పటి వరకు అభి ఫేమ్ తో లాక్కొచ్చినప్పటికీ ఇప్పుడు ఓట్లు పడతాయా అనేది అనుమానమే. ఇక అఖిల్ కి కూడా కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ వారం సేవ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక చివరగా మిగిలింది మోనాల్, అవినాష్. మోనాల్ తన గ్లామర్ తో కొన్ని, సొహైల్ సప్పోర్ట్ తో కొన్ని ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. సో, ఇక మిగిలిన అవినాష్ పాపులారిటీ ఉన్నప్పటికీ ఇతనికి ఓట్లు వేసే సంఖ్య తక్కువ. ఇతను మొత్తం సింపతీ గేమ్ ఆడుతున్నాడని చెప్పేశాడు నాగార్జున. ఇప్పుడు కూడా నాకన్నా వీక్ ఉన్న వాళ్ళు హౌస్ లో ఎలా ఉంటారంటూ ఎద్దేవా చేయడం కూడా తనకి మైనస్  మారింది. ఈ అంచనా ప్రకారం చూస్తే ఈ వారం అవినాష్ గాని హారిక గాని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss