Monday, October 25, 2021

Latest Posts

బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే ప్రారంభం

Bigg Boss Season 5 Telugu Update

స్టార్ మా లో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మాములుగా ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో క్రమం తప్పకుండా చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నారు.

ఎలాగంటే బిగ్ బాస్ వీక్లీ ఓసారి రిపీట్ చేసుకొని చూసేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరిని పక్కనపెడితే షో చూడకపోయినా వీక్లీ ఎవరు ఎలిమినేట్ అయ్యారని కనుక్కుంటూ ఉండేవారు రెండోరకం. అలా కూడా ఉన్నారా అనే సందేహం కలగొచ్చు.. కానీ ఆ కోవకు చెందిన లిస్ట్ కూడా బాగానే ఉంది. అంటే సమయాన్ని బట్టి వారికి.. లేదా పనిలో నిమగ్నమై ఉండటం.. లాంటివి కారణాలతో అలా చూస్తుంటారు.

అయితే త్వరలోనే బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇదివరకే స్టార్ మా యాజమాన్యం తెలిపింది. చూస్తుంటే నిజంగానే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది. కానీ అవేం సందేహాలు అక్కర్లేదని టాక్. 5వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ అని సమాచారం.

త్వరలోనే బిగ్ బాస్ మొదలవుతుంది అనేసరికి ఫ్యాన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి మొదలైంది. ఆ మధ్యలో బిగ్ బాస్ 5వ సీసన్ లో మీడియం స్టార్ లను దింపనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మోస్ట్ అవెయిటింగ్ బిగ్ బాస్.. ఈ ఏడాది ఆగష్టులో ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే ఈసారి యూట్యూబ్ స్టార్స్ – ఇంస్టాగ్రామ్ స్టార్స్ కూడా వస్తారనే తెలుస్తుంది. మరి ఈ సీజన్ స్టార్ట్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss